: రవిశంకర్ యోగా చేసేటప్పుడు సగం గడ్డం నోట్లోకి పోతుంది: ట్వింకిల్ ఖన్నా


ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ పై బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ భార్య, నిన్నటి కథానాయిక, రచయిత, కాలమిస్ట్ ట్వింకిల్ ఖన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. శ్రీశ్రీ రవిశంకర్ యోగా చేసేటప్పుడు ఆయన సగం గడ్డం నోట్లోకే పోతుందని, రాందేవ్ బాబా పర్ఫెక్టుగా యోగా చేస్తారంటూ ఒక ట్వీట్ చేసింది. ‘హోలీ మెన్ అండ్ హెయిర్ టేల్స్’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆమె ఈ కామెంట్ చేశారు. కాగా, ఈ ట్వీట్ తో రవిశంకర్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తాజా సినిమా ‘హౌస్ ఫుల్-3’ను తాము బహిష్కరిస్తామంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ డైరెక్టర్ దర్శక్ హథీ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు స్పందించిన ట్వింకిల్ ఖన్నా, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమించాలని, ఏదో సరదా కోసమే అలా అన్నానని, ఆ ట్వీట్ ను ఉపసంహరించుకుంటున్నానంటూ మరో ట్వీట్ చేశారు. ఇదేసమయంలో తన భర్త సినిమాను బహిష్కరిస్తానన్న దర్శక్ హథీ వ్యాఖ్యలపై ఆమె మండిపడింది. ఏదైనా అడగాలనుకుంటే వ్యాఖ్యలు చేసిన తనను అడగాలని, అంతేకానీ, తన భర్త సినిమాను బహిష్కరిస్తామంటూ హెచ్చరించడం సిగ్గుచేటన్నారు. గమ్మత్తేమిటంటే, ట్వింకిల్ వివరణ ఇచ్చుకున్న ట్వీట్ కు దర్శక్ హథీ స్పందిస్తూ మరో ట్వీట్ చేశారు. తమ మనోభావాలు దెబ్బతినడం వల్లే ఆ విధంగా ట్వీట్ చేశానని, తన వ్యాఖ్యలు బాధిస్తే క్షమించాలని అన్నారు.

  • Loading...

More Telugu News