: హ్యాపీ బర్త్ డే టూ మీ... సినీ నటుడు సంపూర్ణేష్ బాబు
‘హ్యాపీ బర్త్ డే టు మీ. సదా, నా ప్రేమకు నేనే బానిస, మీ సంపూర్ణేష్ బాబు’ అంటూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సినీ నటుడు సంపూర్ణేష్ బాబు తనకు తాను శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేస్తున్న ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’ పోస్టర్ ను కూడా ఆయన షేర్ చేశారు. సంపూ పుట్టిన రోజు సందర్భంగా సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.