: ‘మాకీ’ డిజైన్లకు మార్పులు తప్పవా?... మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కీలక భేటీ
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జూన్ ఆఖరు నాటికి పనులు పూర్తి కావాల్సిందేనన్న చంద్రబాబు సర్కారు ఆదేశాలతో అత్యాధునిక మిషనరీని తెప్పించిన ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నాయి. ఈ నిర్మాణాలకు జపాన్ కు చెందిన ‘మాకీ’ అనే సంస్థ డిజైన్లను అందజేసింది. అయితే ఈ డిజైన్లలో పలు మార్పులు చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ మేరకు విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ లు భేటీ అయ్యారు. సచివాలయం, హైకోర్టు, శాసనసభ భవనాలకు సంబంధించి వారు డిజైన్లను మార్చే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.