: చట్టాలు కూడా తెలుగులోనే ఉండాలి: చక్రపాణి


తెలుగులో న్యాయపాలన అందించడంలో భాగంగా చట్టాలు కూడా తెలుగులోనే ఉండాలని శాసన మండలి ఛైర్మన్ చక్రపాణి సూచించారు. అంతరించిపోయే భాషల్లో తెలుగు కూడా ఒకటని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపిందని ఆయన అన్నారు. తెలుగు మాధ్యమాలు, సాహితి సంస్థలు, భాషాభిమానుల కృషి వల్లే ఇంతకాలం తెలుగు భాష బ్రతికి ఉందని చక్రపాణి అన్నారు.

హైదరాబాద్ జూబ్లీహాలులో జరిగిన 'తెలుగులో న్యాయపాలన' సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలుగును అమలు చేసేందుకు ప్రభుత్వానికి అంకితభావం ఉండాలని చక్రపాణి అన్నారు. తెలుగులో న్యాయపాలన కోసం ఆరు తీర్మానాలు చేసిన ప్రతిని మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైకోర్టు న్యాయమూర్తులకు అందించారు. ఇది చారిత్రక సమావేశమని లక్ష్మయ్య అన్నారు.

  • Loading...

More Telugu News