: నాలో పాకిస్తానీ రక్తం ఉంది... అక్కడి సినిమాల్లో నటించాలని ఉంది: నర్గీస్ ఫక్రీ
‘నాలో పాకిస్తానీ రక్తం ఉంది... అక్కడి సినిమాల్లో నటించాలని ఉంది’ అని పాక్ మూలాలున్న బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ తన మనసులో మాట చెప్పింది. ఒక వార్తా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నర్గీస్ పలు విషయాలను ప్రస్తావించింది. ఎన్ని విభేదాలున్నా మనందరం ఒకటేనని, భవిష్యత్ లో ముందుకు వెళ్లాలంటే కలిసి పనిచేయాలని ఆమె చెప్పింది. 'రాక్ స్టార్' సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించిన నర్గీస్.. స్టార్ డమ్ తో బాధ్యతలు మరింత పెరుగుతాయని చెప్పింది. కాగా, సుమారు పదకొండేళ్ల కిందట నర్గీస్ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.