: ఏపీకి ప్రత్యేకహోదా కోసం కష్టపడుతున్నాం: అశోక్ గజపతి రాజు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం తామంతా కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదా కోసం కృషి చెయ్యడంలో ప్రయత్నలోపం లేదని అన్నారు. విమానయాన రంగానికి వస్తే, దేశంలోని అన్ని విమానాశ్రయాలను సోలార్ శక్తితో నడిచేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటికే కొచ్చి విమానాశ్రయాన్ని సోలార్ విద్యుత్ తో నిర్వహించేలా చేశామని ఆయన చెప్పారు. దశలవారీగా అన్ని విమానాశ్రయాలను సౌరశక్తితో పనిచేసేలా తీర్చిదిద్దుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.