: మహేష్ పక్కన నటిస్తుంటే ఆ టెన్షన్ వుంటుంది!: సమంత


చిన్న చిన్న ఉత్సవాలు కలిపితే బ్రహ్మోత్సవం అవుతుందని హీరోయిన్ సమంత తెలిపింది. బ్రహ్మోత్సవంలో చాలా పెద్ద ఆర్టిస్టులు నటించారని, వారితో పాటు అందమైన హీరోయిన్లు కూడా ఉన్నారని, వారంతా చాలా అద్భుతంగా నటించారని చెప్పింది. సాధారణంగా ప్రతి సినిమాలోనూ హీరోలతో నటించేటప్పుడు ఎలా నటిస్తున్నాను, అతని కంటే బాగా నటించానా? లేదా? అని చూసుకుంటానని, అదే మహేష్ తో నటించేటప్పుడు ఆయన పక్కన ఎలా కనిపిస్తున్నాను? అందంగా కనిపిస్తున్నానా? లేదా? అని టెన్షన్ పడుతుంటానని సమంత నవ్వుతూ చెప్పింది. మిక్కీ జే మేయర్ బాణీలు కట్టిన అన్ని పాటలు బాగున్నాయని సమంత కాంప్లిమెంట్ చేసింది. ఈ సినిమాలో పిల్లలు పెద్దలను వెతుక్కుంటూ వెళ్లడం తనను చాలా ఆకట్టుకుందని సమంత చెప్పింది.

  • Loading...

More Telugu News