: సినిమా ఇలా ఉండాలని గీత గీస్తే...దానిని చెరిపేసి మహేష్ మరోగీత గీస్తారు: వంశీ పైడిపల్లి


సినిమా ఇలా ఉండాలంటూ దర్శకులంతా ఓ గీతను గీస్తే...దానిని చెరిపేసి మహేష్ బాబు మరోగీత గీస్తారని దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పారు. బ్రహ్మోత్సవం ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, మహేష్ బాబుకున్న ధైర్యం ఎవరికీ లేదని అన్నారు. ఎప్పుడో ఆగిపోయిన మల్టీస్టారర్ పంథాను తిరిగి మొదలు పెట్టడంలో ఏంటి, కధను నమ్మి శ్రీమంతుడు తీయడం ఏంటి, సూపర్ స్టార్ గా నీరాజనాలు అందుకున్న హీరో ఒక వ్యక్తికి చెప్పులు తొడుగుతున్నట్టు పోస్టర్ విడుదల చేయడమంటే మాటలు కాదని అన్నారు. అంతటి ధైర్యం, తెగువ మహేష్ బాబు సొంతమని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా సినిమా పరాజయం పాలైతే తాను కూడా అందులో భాగమని పేర్కోవడం గ్రేట్ అని చెప్పాడు. తానింతవరకు ఆయనలాంటి మనిషిని చూడలేదని ఆయన ప్రశంసించారు.

  • Loading...

More Telugu News