: ఆనందం ఎక్కడుందో తెలుసా?: రావు రమేష్


బ్రహ్మోత్సవం ఆడియో వేడుకలో నటుడు రావు రమేష్, నవదీప్ మధ్య తమాషా సంభాషణ జరిగింది. 'అసలు ఆనందం అంటే ఏంటో తెలుసా?' అని రావు రమేష్ వ్యాఖ్యాత నవదీప్ ను అడిగారు. దీనికి నవదీప్ చాలా ఈజీగా 'ఆనందం అంటే పండగ, హ్యాపీ నెస్, పబ్బులు, వాట్స్ యాప్, ఫేస్ బుక్... ఇలా చాలా ఉన్నాయి' అన్నాడు. దానికి రావు రమేష్ తనదైన శైలిలో ఓ ఎక్స్ ప్రెషన్ ఇచ్చి, 'ఇవన్నీ ఆనందం అంటున్నాడు ...ఎవడన్నా వాడిని చూపించండ్రా... అలా వదిలేయకండి' అన్నారు. తర్వాత మళ్లీ తనే చెబుతూ, 'ఆనందం అంటే చీకట్లో వేసుకున్న నల్లబట్టల్లోనే, చీకట్లో వేసే చిందుల్లోనో లేదు. పండగల్లో వేసుకునే తెల్లబట్టల్లో ఉంది' అని ఓ క్షణం ఆగి, మళ్లీ చెబుతూ, 'బుడ్డీల్లోని క్లాస్ సరుకులో ఆనందం లేదు. తాటి చెట్టుకి కట్టిన కుండలో ఉంటుంది. ఇంకా కావాలంటే ఎంకి పాటను పాడుకోవాలి' అన్నారు. దీంతో నవదీప్ అవాక్కయ్యాడు. అభిమానులు క్లాప్స్ కొట్టి కేరింతలు కొట్టారు.

  • Loading...

More Telugu News