: మహేష్ ఇందులో చాలా అందంగా కనిపించాడు: సూపర్ స్టార్ కృష్ణ


సూపర్ స్టార్ కృష్ణ ఎవరినీ ఊరికే పొగడరని పేరు. అలాంటి కృష్ణ తన కుమారుడు మహేష్ బాబును బ్రహ్మోత్సవం ఆడియో వేడుక సందర్భంగా పొగిడారు. ఈ సినిమాలో మహేష్ చాలా అందంగా ఉన్నాడని అన్నారు. హైదరాబాదు, జేఎఫ్ సీ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న బ్రహ్మోత్సవం ఆడియో వేడుకలో తొలి పాటను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీవీపీ తనకు చాలా కాలంగా తెలుసని అన్నారు. అమెరికా వెళ్ళినప్పుడు డెట్రాయిట్ లో ఆయన తమను దగ్గరుండి అమెరికా చూపించారని చెప్పారు. తరువాత సినీ పరిశ్రమకు వచ్చి నిర్మాతగా పేరుతెచ్చుకున్నారని, ఆయన నిర్మాతగా మరింత మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. శ్రీకాంత్ అడ్డాల గతంలో తాను తీసిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా అంత అద్భుతంగా దీనిని కూడా మలిచారని అన్నారు. బ్రహ్మోత్సవం కూడా ఆ సినిమాలా అద్భుతంగా ఆడుతుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News