: ఆ స్కూల్స్ ఉచ్చులో పడొద్దు... విద్యార్థులకు రఘరామ్ రాజన్ హెచ్చరికలు


తనకు తెలిసిన విషయాన్ని, నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ ఎప్పుడూ వెనుకాడరు. ఈ కోవలోనే ఆయన తాజాగా విద్యార్థులకు అమూల్యమైన సలహాలతోపాటు హెచ్చరికలు కూడా చేశారు. శివ్ నాడార్ యూనివర్సిటీ స్నాతకోత్సవ సభ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజన్ మాట్లాడుతూ... నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, దురదృష్టవశాత్తూ ఇది చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికో పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విద్యా రుణం దీనికి ఓ పరిష్కారమని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. అమెరికాలో విద్యా రుణాల సమస్య ఉందని, అలాంటిది ఇక్కడ కూడా ఏర్పడరాదన్నారు. విద్యారుణం అర్థం తెలిసిన వారు దాన్ని తిరిగి చెల్లించాలని సూచించారు. సమస్యలు ఎదురైనప్పుడు, తక్కువ వేతనం ఉద్యోగాల్లో ఉన్నవారు తిరిగి రుణాలను చెల్లించడంలో విఫలమవుతున్నారని అలాంటి పరిస్థితి ఉండరాదని అభిప్రాయపడ్డారు. అలాగే, ప్రమాణాలు పాటించని, అప్పులతో నడుస్తున్న స్కూల్స్ ఉచ్చులో పడొద్దని విద్యార్థులను హెచ్చరించారు. అలాంటి స్కూల్స్ లో చేరే విషయమై జాగ్రత్తగా వ్యవహరించాలని, అవి జారీ చేసే డిగ్రీలకు విలువ వుండదన్నారు.

  • Loading...

More Telugu News