: సౌదీలో చిత్రహింసలకు గురైన హైదరాబాదీ యువతి.. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి
సౌదీ అరేబియాలో ఓ ఇంట్లో పనిమనిషిగా చేరడానికి వెళ్లిన ఓ హైదరాబాదీ యువతి అక్కడ చిత్రహింసలకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పనికోసం సౌదీకి వెళ్లిన తమ కూతురు మృతి చెందడంతో ఆయువతి కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. హైదరాబాద్కు చెందిన అసీమా (25) గత ఏడాది డిసెంబరులో సౌదీలోని రియాద్ వెళ్లింది. ఓ ఇంట్లో పనిమనిషిగా చేరిన ఆమెకు.. ఆ ఇంటి యజమాని నుంచి వేధింపులు ఎదురయ్యాయి. కనీసం హైదరాబాద్‌లోని తన కుటుంబ సభ్యులకు సమాచారం కూడా తెలియని స్థితిలో ఆ యువతి నరకయాతన అనుభవించింది. అసీమా రియాద్‌కు చేరిన రెండు నెలల అనంతరం చివరికి ఎలాగోలా హైదరాబాద్‌లోని తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తనను తన యజమాని అబ్దుల్ రహ్మాన్ అలీ మహ్మద్ శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని చెప్పింది. దీంతో అసీమా కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రభుత్వాధికారులను ఆశ్రయించారు. అయితే అసీమా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు సమాచారం అందింది. దీంతో అసీమా కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.