: తప్పు చేసి...సరిదిద్దుకుని... ఆనక 66 లక్షలు విరాళమిచ్చిన పాప్ సింగర్


ప్రముఖ ర్యాపర్ '50 సెంట్' పొరపాటున ఓ వ్యక్తిని దుర్భాషలాడి వాస్తవం తెలుసుకుని క్షమాపణలు చెప్పి 66 లక్షల రూపాయలు విరాళమిచ్చిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...'డా' క్లబ్ సింగర్ అయిన '50 సెంట్' (కర్టిస్ జాక్సన్) తాజాగా అమెరికాలోని సిన్సినాటి ఎయిర్ పోర్టులో ఆండ్యూఫారెల్ (19) అనే యువకుడు జోగుతూ నడవడం చూశాడు. అతను డ్రగ్స్ మత్తులో అలా జోగుతూ నడుస్తున్నాడని భావించిన '50 సెంట్', అతనిని తూలనాడుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. దీనిపై స్పందించిన ఫారెల్ సవతి తండ్రి తన కుమారుడు డ్రగ్స్ మత్తులో జోగడం లేదని, ఆటిజం బాధితుడని, అందుకే అలా నడిచాడని, సహాయం చేయకపోయినా పర్లేదు కానీ నిందించవద్దని, అలాంటి వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. దీంతో చలించిపోయిన '50 సెంట్' వెంటనే ఆండ్యూఫారెల్ కు క్షమాపణలు చెప్పాడు. అంతటితో ఆగని '50 సెంట్' తన దుందుడుకు ప్రవర్తనకు సిగ్గు పడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆటిజంపై అవగాహన కల్పిస్తున్న 'ఆటిజం స్పీక్స్'కు 66 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. అంతే కాకుండా తనలాంటి సింగర్లంతా ఆటిజం బాధితులకు అండగా నిలవాలని కోరాడు.

  • Loading...

More Telugu News