: క్లబ్బులో తన్నుకున్న పాప్ స్టార్, ర్యాపర్


నిత్యం వివాదాలతో సావాసం చేసే పాప్ స్టార్ జస్టిన్ బీబర్ (22) మరో వివాదంలో తలదూర్చాడు. అమెరికాలోని బ్రూక్లిన్ లో తన కాన్సర్ట్ ముగిసిన తరువాత న్యూయార్క్ లోని 'వన్ ఓక్' క్లబ్బుకు వెళ్లాడు. అక్కడ కేన్ వెస్ట్ బృంద సభ్యుడైన ర్యాపర్ డిజినర్ (19) ప్రదర్శన ఇస్తున్నాడు. ప్రదర్శన సందర్భంగా వీక్షకుల్లో ఉత్సాహం నింపేందుకు డిజినర్ పాడుతూ, జనంలో కలియదిరిగాడు. వీఐపీ లాంజ్ లో ఉన్న జస్టిన్ బీబర్ వద్దకు వెళ్లిన డిజినర్ గెంతుతూ పలు మార్లు అతని కాళ్లు తొక్కాడు. దీంతో బీబర్ అతనిని బలంగా తోసేశాడు. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. దీంతో క్లబ్ నిర్వాహకులు సెక్యూరిటీ మధ్య డిజినర్ ను అక్కడి నుంచి తరలించారు. కాగా, ప్రదర్శన మధ్యలోనే ఆపేయడంతో వీక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా వివాదంపై ఇద్దరిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News