: ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు త‌గ్గాయ్.. నేడూ వ‌ర్ష‌సూచ‌న


ఐదు రోజుల క్రితం వ‌ర‌కు సాధారణం కంటే 4నుంచి 6 డిగ్రీల సెల్సియ‌స్ వ‌ర‌కు ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిపోయాయ‌ని, మ‌ధ్యాహ్నం పూట బ‌య‌ట‌కు వ‌స్తే ప్ర‌మాదమే అంటూ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా వాతావ‌ర‌ణం సీన్ రివ‌ర్స్ అయింది. ఇప్పుడు పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గినట్లు విశాఖ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ ప్రాంతాల్లో నేడు కూడా ప‌లు చోట్ల ఈదురు గాలుల‌తో కూడిన‌ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో అత్య‌ధికంగా నిన్న‌ చిత్తూరు జిల్లా పుంగనూరులో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News