: ఉప్పల్ స్టేడియంలో గవర్నర్ నరసింహన్!... సన్ రైజర్స్ మ్యాచ్ ను తిలకించిన వైనం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో నిన్న ఐపీఎల్ టోర్నీలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాదు, గుజరాత్ లయన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కెప్టెన్ శిఖర్ ధావన్ వీరోచిత ఇన్నింగ్స్ కు తోడు బౌలర్లు కూడా రాణించడంతో సన్ రైజర్స్ మ్యాచ్ విన్నర్ గా నిలిచింది. ఈ మ్యాచ్ ను చూసేందుకు హైదరాబాదీ క్రికెట్ లవర్స్ పోటెత్తగా.,.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా హాజరయ్యారు. బీజేపీ సీనియర్ నేత, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వెంట రాగా స్టేడియంలోని వీవీఐపీ గ్యాలరీలో కూర్చున్న నరసింహన్ మ్యాచ్ ను తిలకించారు.