: రేపే టీడీపీలో చేరుతున్నా: వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెబుతున్నారు. శనివారం కర్నూలులో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. కర్నూలు జిల్లా అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. డబ్బు కోసమే పార్టీ మారుతున్నానని అనడంలో నిజం లేదని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెరువుకు గండిపడిందని, చివరికి జగన్ తప్ప చుక్క నీరు కూడా మిగలదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.