: సాక్షి మహరాజ్ అమర్యాదకర ప్రవర్తన!


బీజేపీ వివాదస్పద ఎంపీ, సీనియర్ నేత సాక్షి మహరాజ్ తన అమర్యాదకర ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని ఒక నివాసంలో ఒక బాలికను ప్యాంట్ తొలగించి తగిలిన గాయాలను చూపించమని కోరారు. దీంతో, ఆ బాలిక తనకు తగిలిన గాయాలను చూపించింది. దీనిని అక్కడే ఉన్న కొంత మంది మహిళలు, పురుషులు చూస్తుండటం గమనార్హం. కాగా, ఈ తతంగమంతా వీడియోలో రికార్డు అయింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాలకు చేరడంతో సాక్షి మహరాజ్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News