: మంటల నుంచి ఫోన్ ఛార్జింగ్ చేసుకోవచ్చట!


సుదూర ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలకు వెళ్లినప్పుడు, విహారయాత్రలకు వెళ్లినప్పుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయం అందుబాటులో ఉండదు. అలాంటి సందర్భాల్లో తీవ్ర ఆందోళనకు గురవ్వడం సర్వసాధారణం. ఇకపై ఈ ఆందోళనకు స్వస్తి చెప్పచ్చంటున్నారు నిపుణులు. అలాంటి సందర్భాల్లో మంట రాజేయగలిగితే అక్కడ ఫోన్ ఆటోమేటిక్ గా ఛార్జింగ్ అవుతుందని వారు చెబుతున్నారు. మంటలతో ఛార్జింగ్ ఎలా సాధ్యమన్న అనుమానం వచ్చిందా?...ఫ్లేమ్ స్టోవర్ అనే ఛార్జర్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఛార్జర్ కి ఒకవైపు బ్లేడ్ ఉంటుంది. ఈ బ్లేడ్ మంటల్లో పెడితే అది ఉష్ణశక్తిని గ్రహిస్తుంది. ఆ ఉష్ణశక్తిని దానిలో ఉండే జనరేటర్ లోకి పంపిస్తుంది. ఆ జనరేటర్ నుంచి యూఎస్బీ కేబుల్ కు కనెక్ట్ చేసుకుని ఫోన్ ఛార్జింగ్ చేసుకోవచ్చని వారు తెలిపారు. దీంతో నిమిషం సేపు ఛార్జింగ్ పెడితే రెండు నిమిషాలు మాట్లాడుకోవచ్చని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News