: సునంద పుష్కర్ కేసు మళ్లీ మొదటికి!... ఫోరెన్సిక్ నివేదిక పరిశీలనకు మరో డాక్టర్స్ ప్యానెల్


కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ అనుమానాస్పద మరణానికి సంబంధించిన కేసు మళ్లీ మొదటికొచ్చింది. ఈ కేసును ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఓ కొలిక్కి తెచ్చారు. సునంద ఆత్మహత్య చేసుకోలేదని, విష ప్రయోగంతోనే ఆమె మరణించిందని తేల్చారు. పొలోనియం తరహా రసాయనంతో జరిగిన విష ప్రయోగం ద్వారానే ఆమె చనిపోయిందని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆధ్వర్యంలోని ల్యాబ్ కూడా తేల్చింది. ఈ పదార్థం ఏమిటన్న విషయాన్ని తేల్చేందుకే ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం... హత్య చేయించిన వారెవరన్న విషయంపై మాత్రం దృష్టి సారించడం లేదు. తాజాగా ఎఫ్ బీఐ అందజేసిన ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికను విశ్లేషించేందుకు కొత్తగా మరో డాక్టర్స్ ప్యానెల్ ను నియమిస్తూ కేంద్రం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News