: ఛాయ్ వాలా అవతారమెత్తిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి!


చిన్నప్పుడు తాను ఛాయ్ అమ్మానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన నాటి నుంచి ఛాయ్ వాలాగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నించని బీజేపీ నేత లేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ఛాయ్ వాలా అవతారమెత్తారు. ఉజ్జయినిలో జరుగుతున్న సింహస్థ మహా కుంభమేళాను పురస్కరించుకుని, సిప్రా నదీతీరంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలను ఆయన తెల్లవారు జామున సందర్శించారు. ఈ సందర్భంగా టీ కెటిల్ చేతబట్టి అక్కడున్న భక్తజనానికి టీ సరఫరా చేశారు. సాక్షాత్తూ సీఎం ఛాయ్ వాలా అవతారం ఎత్తడంతో భక్తులు మహదానందపడిపోయారు. కాగా, అంతకు ముందు ఈ గుడారాలు కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 40 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News