: ట్విట్టర్ లో కాజల్ అగర్వాల్... 23 గంటల్లో 25 వేల మంది ఫాలోయర్లు


సామాజిక మాధ్యమం ట్వట్టర్ లో బహుభాషా నటి కాజల్ అగర్వాల్ అడుగుపెట్టింది. ఇప్పటికే ఫేస్ బుక్ లో అధికారిక పేజీ కలిగిన కాజల్ ట్విట్టర్ లో మాత్రం కాలు పెట్టలేదు. దీంతో కాజల్ ట్విట్టర్ ఖాతా అంటూ గతంలో పలు నకిలీ ఖాతాలు పుట్టుకొచ్చాయి. దీంతో ఆమె పలు సందర్భాల్లో తనకు ట్విట్టర్ ఖాతా లేదని, ఆ ఖాతాలన్నీ నకిలీవని వివరణ ఇచ్చింది. ఇలా వివరణ ఇచ్చి విసిగిపోయిందో లేక బాలీవుడ్ నటులంతా ట్విట్టర్ వేదికగా ఉన్నారని భావించిందో కానీ, ఎట్టకేలకు ట్విట్టర్లో చేరింది. ట్విట్టర్ లో అధికారిక ఖాతా ఓపెన్ చేశానని ప్రకటించిన 23 గంటల్లోనే ఆమెను 25 వేల మంది ఫాలో చేయడం విశేషం.

  • Loading...

More Telugu News