: తిరుమల మొదటి కనుమ రహదారిలో జీపు బోల్తా
తిరుమల మొదటి కనుమ రహదారిలో జీపు బోల్తా కొట్టింది. తిరుమల 22వ మలుపు వద్ద లోయలోకి జీపు దూసుకెళ్లడంతో నలుగురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కాగా, సంఘటనా స్థలానికి సంబంధిత అధికారులు చేరుకున్నారు. లోయలో పడిపోయిన జీపులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే విషయాన్ని ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు.