: ఏసీ లాంటి కూలర్... తక్కువ ధర, తక్కువ విద్యుత్ వినియోగం... సింఫనీ ఆవిష్కరణ!


దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఏటికేడు ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వేడి గాలులు కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండలోకి వెళ్లడమే కాదు. ఇంట్లో ఉండాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటోంది. ఏసీలు కొని వినియోగించే సామర్ధ్యం అందర్లోనూ వుండదు. దీనిని దృష్టిలో పెట్టుకుని సింఫనీ సంస్థ సరికొత్త ఏసీకి రూపకల్పన చేసింది. ఇది ఏసీ కాదు కానీ ఏసీలా పని చేసే గోడకు తగిలించుకునే కూలర్. దీని ధర 14,999 రూపాయలు. క్లౌడ్ కూలర్ అని పిలిచే దీని పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేశామని, అవి రాగానే దీనిని అహ్మదాబాద్ లో విక్రయించి, దేశ వ్యాప్తం చేస్తామని సింఫనీ ఎండీ తెలిపారు. ఏసీ వినియోగించుకునే విద్యుత్ లో ఇది కేవలం పది శాతం మాత్రమే వినియోగిస్తుందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News