: పవన్ కల్యాణ్ మమ్మల్ని ఆదుకోవాలి.. జనసేన అధినేత పేరిట ఫ్లెక్సీలు వేయించిన తాడేపల్లి రైతులు
తమను ఆదుకోవాలంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ పేరిట ఫ్లెక్సీలను వేయించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియను తాము వ్యతిరేకిస్తున్నట్లు మీడియాకు తెలిపారు. రాజధాని పరిధి నుంచి పెనుమాక, ఉండవల్లి భూములను పవన్ కల్యాణే తప్పించాలని కోరుతున్నారు. తమను ఆదుకుంటామని గతంలో పవన్ హామీ ఇచ్చారని.. తాను ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకోవాలని రైతులు విన్నవించుకుంటున్నారు. తమ భూములను కోల్పోయేందుకు ఒప్పుకోమని చెబుతున్నారు. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో అయినా పవన్ కల్యాణ్ తమ సమస్యల పట్ల గళం విప్పుతారని ఆశిస్తున్నారు.