: నీటి రైలుని అడ్డుకున్న యూపీ ప్రభుత్వం
తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కుంటోన్న మహారాష్ట్రలోని లాతూర్‌కి ప్రభుత్వం ప్రత్యేక రైలు ద్వారా నీళ్లను సరఫరా చేస్తోన్న విషయం తెలిసిందే. నీటి రైలు కోసం ఎదురుచూస్తూ ఆ ప్రాంత ప్రజలు.. రైలు అక్కడకు చేరుకోగానే ఆత్రుతగా నీళ్లు పట్టుకుంటున్నారు. అలాగే, ఉత్తర ప్రదేశ్‌లో తీవ్ర నీటి ఎద్దడితో దుర్భిక్షాన్ని ఎదుర్కుంటోన్న బుందేల్‌ఖండ్‌లో ప్రజలకు కేంద్రం నీటి రైలుని పంపింది. కానీ, ఆ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకుంది. తమకు నీటి రైలు వద్దని చెప్పింది. ఎల్లుండి ఆ రాష్ట్ర సీఎం ప్రధాని మోదీతో నీటి ఎద్దడి సమస్యపై భేటీ కానున్నారు. బుందేల్‌ఖండ్‌కు అఖిలేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది.