: ‘సుప్రీమ్’లో వాళ్లిద్దరి స్టెప్పులు అదిరాయన్న మెగాస్టార్ చిరంజీవి


‘అందం హిందోళం’ రీమిక్స్ సాంగ్ కు సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నాలు వేసిన స్టెప్పులు తనకు బాగా నచ్చాయని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ‘సుప్రీమ్’ చిత్రం స్పెషల్ షోను నిన్న రాత్రి ఆయన చూశారు. కమర్షియల్ అంశాలతో ఈ సినిమా చాలా బాగుందని, సాయిధరమ్ తేజ్, రాశిఖన్నాల కాంబినేషన్ చూడముచ్చటగా ఉందని చిరంజీవి మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు విడుదలైంది.

  • Loading...

More Telugu News