: పశ్చిమబెంగాల్ లో చివరిదశ పోలింగ్ ప్రారంభం
పశ్చిమ బెంగాల్ లో చివరి దశ పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ లో భాగంగా తూర్పు మిడ్నాపూర్, కూచ్ బిహార్ జిల్లాల్లోని 25 నియోజకవర్గాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 6,774 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 50 వేల మంది భద్రతా సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 25 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 170 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కాగా, బంగ్లాదేశ్ తో సరిహద్దు ప్రాంతాల బదిలీతో కూచ్ బిహార్ ప్రజలు ప్రస్తుత ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత సాధించారు.