: కొత్త గెటప్ లో సంగీత దర్శకుడు ఇళయరాజా!


ఎప్పుడూ సంప్రదాయక దుస్తుల్లో దర్శనమిచ్చే సంగీత దిగ్గజం ఇళయారాజా తన గెటప్ మార్చారు. వెరైటీ గెటప్ లో తన అభిమానులకు కనిపించారు. సూటు, బూటు ధరించి, జేబులో ఓ చెయ్యిపెట్టుకుని, మరో చేతిలో గిటార్ పట్టుకుని ఉన్న ఇళయరాజా ఒక మ్యూజిక్ కన్సర్ట్ కోసం ఈ గెటప్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇళయరాజా న్యూలుక్ ఫొటోను చూసిన ఆయన బంధుమిత్రులు, అభిమానులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన ఇళయరాజా వయస్సు 72 ఏళ్లు.

  • Loading...

More Telugu News