: ఏపీకి ప్రత్యేకహోదా రావడానికి సమయం పడుతుంది: బీజేపీ నేత రఘునాథ్ బాబు
ఉత్తరాఖండ్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రెండేళ్లకు గానీ ప్రత్యేక హోదా రాలేదని... ఏపీకి ప్రత్యేకహోదా రావడానికి సమయం పడుతుందని బీజేపీ నేత రఘునాథ్ బాబు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి అధికార కాంగ్రెస్ ఏపీకీ ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామంటే, పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు అడిగారని, నాటి ఎన్నికల ప్రచారంలో ఈ విషయమై మోదీ ఆంధ్రులకు హామీ కూడా ఇచ్చారని అన్నారు.