: ఇన్ స్టా గ్రాంలో ఆ ఫోటో...40 లక్షల ఉద్యోగానికి ఎసరు పెట్టింది!
ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయి, ఉద్యోగం ఖాయం అని తేలిన తరువాత ఒక ఫోటో చూసి 'నీకా ఉద్యోగం ఇవ్వడం లేదు' అంటే...పరిస్థితి ఎలా ఉంటుందో లాంగ్ ఐలాండ్ లోని సమంతా చిరిచెల్లా (26)ను అడిగితే తెలుస్తుంది. అమెరికాలోని న్యూయార్క్ సమీపంలోని లాంగ్ ఐలాండ్ లో సమంతా చిరిచెల్లా కాన్ ఎడ్ సంస్థలో 40 లక్షల రూపాయల వేతనం తీసుకునే ఉద్యోగం సంపాదించుకుంది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. జాయిన్ కావడమే తరువాయి. ఇంతలో ఆమెకు ఆ ఉద్యోగం ఇవ్వడం లేదని కంపెనీ తెలిపింది. దీనికి కారణం ఏమిటా? అని ఆరాతీయగా, ఆమె ఇన్ స్టా గ్రాం ఖాతాలో ఇద్దరు మహిళలు నగ్నంగా ముద్దుపెట్టుకుంటున్న ఫోటో ఉందని, దీంతో ఆమెను లెస్బియన్ గా భావించిన కంపెనీ ఉద్యోగం ఇవ్వడం లేదని తెలిసింది. దీనిపై మండపడ్డ సమంత కళగా చూడాల్సిన ఫోటోలను పోర్న్ గా చూస్తున్నారంటూ ఆవేదన చెంది, సదరు కంపెనీపై కోర్టులో దావా వేసింది. ఈ ఘటనతో ఆమెకు విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది.