: చంద్రబాబు, జగన్ కలిసి ఢిల్లీలో పోరాడాలి: చలసాని
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఇద్దరూ కలిసి పోరాడాలని ఏపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు ఇప్పటికైనా ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికీ ఒక్కటి కాకపోతే ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. ఏపీ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలంతా కలిసి ప్రధాని ఇంటి ముందు ఆందోళన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదాతో రాష్ట్ర ఇబ్బందులు తొలగిపోతాయని ఆయన పేర్కొన్నారు.