: కాటేదాన్ కాల్పుల కేసు: దోపిడీ కోసమే ప్రసాద్‌పై నాటు తుపాకీతో కాల్పులు.. దర్యాప్తులో వెల్లడి
హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో రెండు రోజులుగా రెక్కీ నిర్వహించి, అక్కడి మనీ ట్రాన్స్ ఫర్ కార్యాలయంలోకి చొరబడి పలువురు దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగించిన పోలీసులు ఎట్టకేలకు మిస్టరీని ఛేదించారు. కార్యాలయంలోకి చొరబడి ప్రసాద్‌పై కాల్పులు జరిపిన దుండగులను ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ముఠాగా గుర్తించారు. దోపిడీ కోసమే వారు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ నిందితులలో ఒకరిని రాహుల్‌గా పోలీసులు పేర్కొన్నారు. రాహుల్ మరో ఇద్దరితో కలిసి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి విచారణ అనంతరం దుండగుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.