: విశాఖ ఫ్లైటెక్కిన వైఎస్ జగన్... మరికాసేపట్లో బ్రాండెక్స్ కార్మికులకు సంఘీభావం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాదు నుంచి విమానంలో విశాఖకు బయలుదేరారు. విశాఖలో అడుగుపెట్టిన మరుక్షణం ఆయన జిల్లాలోని అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండెక్స్ కంపెనీ వద్దకు బయలుదేరతారు. కంపెనీ ఎదుట నిరసన కొనసాగిస్తున్న కార్మికులకు ఆయన సంఘీభావం ప్రకటిస్తారు. ఆ తర్వాత అక్కడే కొద్దిసేపు గడపనున్న జగన్... కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు.