: ఏపీలో కరవు నివారణకు ప్రత్యేక చర్యలు: డిప్యూటీ సీఎం చినరాజప్ప
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరవు నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం చినరాజప్ప చెప్పారు. అనంతపురం జిల్లాలో తాగునీరు, పశుగ్రాసం కొరత, కరవు పరిస్థితులపై అధికారులతో చినరాజప్ప సమీక్షించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరాకు ప్రాధాన్యతనిస్తామన్నారు. గల్ఫ్ దేశాలకు పంపే ముఠాలపై నిఘా, పోలీసులకు మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక మొదలైన అంశాలపై ఆయన సమీక్షించారు. సమీక్ష కార్యక్రమంలో మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, పలువురు అధికారులు పాల్గొన్నారు.