: 25 ఏళ్ల లోపు వివాహం చేసుకుంటే విడాకుల ముప్పు ఉన్నట్టే


25 ఏళ్లలోపు వివాహం చేసుకుంటే విడాకుల ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెళ్లయిన వయసును బట్టే దాంపత్యంలో సమస్యలు వస్తాయని తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 25 ఏళ్లలోపు వివాహం చేసుకున్న జంటలలో చికాకులు పెరుగుతాయని, అవి చిలికి చిలికి గాలివానగా మారి విడాకులు వరకు వెళ్తాయని పరిశోధకులు తెలిపారు. ఈ సర్వే కోసం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో విడాకులు పొందిన జంటలు, పెళ్లి నాటికి వారి వయసు వివరాలు సేకరించారు. ఇందులో 25 ఏళ్లలోపు పెళ్లి చేసుకున్న జంటలతో పాటు భార్యాభర్తల మధ్య భారీ వయసు తేడా ఉన్న జంటలు కూడా విడాకులు తీసుకుంటున్నట్టు గుర్తించారు. భర్త వయసు కంటే భార్య వయసు బాగా తక్కువగా ఉన్నప్పుడు ఇలా జరుగుతోందని వారు పేర్కొన్నారు. సమస్యలను, పరిస్థితులను అర్థం చేసుకునే వయసు కాకపోవడం వల్ల ఇలా జరుగుతోందని వారు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News