: జూబ్లీహిల్స్ కారు ఢీ ఘటనలో దేవి మృతిపై ఎన్నో అనుమానాలు


హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లోని ఓ చెట్టుకు కారు ఢీ కొట్టిన ఘటనలో నారాయణమ్మ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న దేవి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు నిమిషాల్లో ఇంటికి వస్తున్నానని చెప్పిన దేవి, అంతలోనే ఎలా మృతి చెందిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవింగ్ సీట్ కు ఉన్న ఎయిర్ బ్యాగ్ తెరుచుకున్నప్పుడు దేవి కూర్చున్న సీటు వైపున్న ఎయిర్ బ్యాగ్ కూడా తెరుచుకుని ఉండాలి కదా? అలా ఎందుకు జరగలేదు? అని వారు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో దేవి స్నేహితుడని చెబుతున్న భరతసింహారెడ్డి మద్యం సేవించాడని పోలీసులు చెబుతున్నారు. అతడు ఎంత మొత్తంలో మద్యం సేవించాడన్న రికార్డులు ఎందుకు చూపించడం లేదని వారు నిలదీస్తున్నారు. అదే సమయంలో వారు ఢీ కొట్టిన చెట్టు బలహీనంగా ఉందని, ఢీ కొట్టినట్టైతే ఎవరో కత్తితో నరికినట్టు ఎలా ఉంటుందని వారు అడుగున్నారు. కాగా, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి చెబుతూ, 'రక్షించండి' అంటూ ఆమె అరవడం విన్నానని, ఎవరో ఆమెను లాగి కారులో పడేయడం చూశానని తెలిపాడు. అయితే భయంతో తాను అటువైపు వెళ్లలేదని ఆయన చెప్పాడు. ఈ ఘటనలో భరత్ కావాలని దేవిని చంపి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని, అతడిని శిక్షించి తమకు న్యాయం చేయాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News