: బర్త్ డే వేడుకకు డీజే వద్దన్న పోలీసులు... రాళ్ల వర్షం కురిపించిన బాలనేరస్తులు


తోటి బాలనేరస్తుడి పుట్టిన రోజు వేడుకలో డీజే ఏర్పాటుకు తిరస్కరించిన పోలీసులపై మిగతా బాలనేరస్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. సూరజ్ కుండ్ అబ్జర్వేషన్ హోంలో ఒక బాల నేరస్తుడి పుట్టిన రోజు వేడుకలను పోలీసులు నిర్వహించాలనుకున్నారు. అయితే, ఈ సందర్భంగా డీజే ఏర్పాటు చేయాలని తోటి బాలనేరస్తులు సదరు అధికారులను కోరగా, అందుకు వారు తిరస్కరించారు. దీంతో, పోలీసులపై వారు రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకుగాను పోలీసులు రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయువు ప్రయోగించారు. ఈ తతంగమంతా జరుగుతుండటంతో, ఇదే అదునుగా భావించిన 24 మంది బాల నేరస్థులు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News