: తెలంగాణలో దారుణమైన కరవు పరిస్థితులు ఉన్నాయి, పిల్లల్ని కరవు కోరల్లోంచి రక్షించాలి: నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి
తెలంగాణలో దారుణమైన కరవు పరిస్థితులు ఉన్నాయని, పిల్లల్ని కరవు కోరల్లోంచి రక్షించాలని నోబెల్ గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాశ్ సత్యార్థి అన్నారు. న్యూఢిల్లీలో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కరవుకి బాలలు బలికాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. వేలాది మంది చిన్నారులపై కరవు ప్రభావం ఉందని తెలిపారు. ఆ ప్రాంతంలో కేంద్రం అత్యవసర పరిస్థితి ప్రకటించాలని సూచించారు. పిల్లలు కరవు కారణంతో విలపించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని కోరారు. ప్రతీ ఒక్కరూ నీటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.