: ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు మద్దతు తెలపాలి: సీఎం చంద్రబాబుకు కేవీపీ లేఖ
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ఒక లేఖ రాశారు. రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు.. రాష్ట్ర విభజన బిల్లుకు సంబంధించిన సవరణలపై ఈ లేఖలో ఆయన వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి ఇచ్చిన సమాధానాన్ని చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే విషయాన్ని ఈ సందర్భంగా కేవీపీ గుర్తు చేశారు. ఈ నెల 13న మళ్లీ రాజ్యసభలో చర్చ జరగనుందని, టీడీపీ ఎంపీలు సభకు హాజరై మద్దతు తెలపాలని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్ని పార్టీలు సమష్టిగా ఉండాలని కోరారు. ఈ విషయంలో చంద్రబాబు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతు కూడగట్టాలని కేవీపీ ఆ లేఖలో అభిప్రాయపడ్డారు.