: నటుడు గోవిందా నాపై విజయం సాధించడం కోసం దావుద్ ఇబ్రహీం సాయం తీసుకున్నాడు: ఉత్తరప్రదేశ్ గవర్నర్
బాలీవుడ్ నటుడు గోవిందా గతంలో తనపై ఎన్నికల్లో విజయం సాధించడానికి దావూద్ ఇబ్రహీం సాయం తీసుకున్నాడని ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ ఇటీవలే ఆవిష్కరించిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. 2004 ఎన్నికల్లో బీజేపీ తరఫున లోక్సభ స్థానం కోసం రామ్ నాయక్ పోటీకి దిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన తన ప్రత్యర్థి గోవిందా చేతిలో 11 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఆ గెలుపు కోసం గోవిందా అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంతో పాటు బిల్డర్ హితేన్ థాకూర్ల సాయం తీసుకున్నారని రామ్ నాయక్ పేర్కొన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ తాను పరాజయం పాలయ్యానని, తన ప్యత్యర్థి గోవిందా.. దావుద్ ఇబ్రహీం, బిల్డర్ హితేన్ థాకూర్ ల సాయంతో గెలుపొందారని చెప్పారు. అయితే తాను మాత్రం ఎన్నికల్లో ఎవరి సాయం తీసుకోలేదని వివరించారు.