: కోహ్లీకి ఖేల్ రత్న ఇవ్వండి!... కేంద్రానికి బీసీసీఐ లేఖ
టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి త్వరలోనే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు రానుంది. ఇటీవల సూపర్ ఫాంలో ఉన్న కోహ్లీ... త్వరలోనే ధోనీ చేతి నుంచి టీమిండియా పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ బాధ్యతలను కూడా తీసుకోనున్నాడు. ఈ క్రమంలో అతడి సత్తాకు ఫిదా అయిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అతడికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం బీసీసీఐ కేంద్రానికి ఓ లేఖ రాసింది. బీసీసీఐ ప్రతిపాదనలకు కేంద్రంగా పెద్దగా అడ్డు చెప్పడం లేదు. దీంతో కోహ్లీకి... త్వరలోనే ఖేల్ రత్న అవార్డును అందుకుంటాడన్న మాట.