: కాంగ్రెస్ కు ఝలక్కిచ్చిన ఖల్ నాయక్!... బీజేపీ కార్యక్రమంలో తళుక్కుమన్న మున్నాభాయ్!
‘ఖల్ నాయక్’ చిత్రం ద్వారా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్... తదనంతరం మున్నాభాయ్ బాలీవుడ్ లో చెరగని ముద్ర వేశాడు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అతడు... దోషిగా శిక్ష అనుభవించి ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. కాంగ్రెస్ తో చాలాకాలంగా సత్సంబంధాలు నెరపిన అతడు... నిన్న ముంబైలో బీజేపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో తళుక్కున మెరిశాడు. జైలు నుంచి విడుదలైన దగ్గరి నుంచి బయట పెద్దగా కనిపించని సంజయ్ దత్... నిన్నటి బీజేపీ కార్యక్రమానికి హాజరై కాంగ్రెస్ కు షాక్ ఇచ్చాడు. బీజేపీలో సంజయ్ దత్ చేరిపోతున్నాడన్న ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. తమ పార్టీతో సుదీర్ఘకాలంగా మంచి సంబంధాలు కలిగి ఉన్న సంజయ్ దత్... బీజేపీ కార్యక్రమానికి హాజరుకావడం సరికాదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముంబై శాఖ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.