: వ్యాపారంగా మారిన రాజకీయాలు!... వచ్చేది లేదంటున్న దర్శకరత్న!
ప్రస్తుత రాజకీయాలపై కేంద్ర మాజీ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన దాసరి, తాను మాత్రం మరోమారు ఆ రాజకీయాల్లోకి రాలేనని తేల్చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల దాసరి ఇంటికి వెళ్లిన నేపథ్యంలో దర్శకరత్న మరోమారు యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంటరవుతున్నారన్న పుకార్లు వినిపించాయి. అయితే ఆ పుకార్లకు దాసరి ఫుల్ స్టాప్ పెట్టేశారు. హైదరాబాదులో నిన్న మీడియాతో మాట్లాడిన సందర్భంగా దాసరి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాలు వ్యాపారంగా మారుతున్నాయి. ఇప్పుడు నాలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదు. వచ్చినా బురద చల్లించుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తనను కలిసిన జగన్ రాజకీయాల్లోకి రావాలనని తనకు ఆహ్వానమేమీ పలకలేదని కూడా ఆయన తెలిపారు.