: పవన్ కల్యాణ్ సర్, మీరు మలయాళంలో నటించొచ్చు కదా?: 'ప్రేమమ్' ఫేం అనుపమ పరమేశ్వరన్


'పవన్ కల్యాణ్ సర్, మీరు మలయాళంలో నటించొచ్చు కదా?' అంటూ మలయాళంలో చిన్న సినిమాగా రిలీజై సూపర్ హిట్ కొట్టిన 'ప్రేమమ్' ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ అడిగింది. 'అ..ఆ' సినిమా ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, తనకు ఇదే తొలి తెలుగు సినిమా అని చెప్పింది. అలాగే పవన్ కల్యాణ్ సర్ ని కలవడం ఇదే తొలిసారని చెప్పింది. అ..ఆ...మంచి విజయం సాధిస్తుందని తెలిపింది. తనతో పని చేసిన సమంత, నితిన్ ఎంతో సహకరించారని చెప్పిన అనుపమ, దర్శకుడు త్రివిక్రమ్ ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచారని పేర్కొంది. పవన్ కల్యాణ్ సర్ మలయాళంలో నటిస్తే చూడాలని ఉందని చెప్పింది. దీనికి పవర్ స్టార్ నవ్వుతూ 'అబ్బే... వద్దు' అన్నట్టు సైగ చేశారు. దీంతో యాంకర్ సుమ అందుకుని, 'అవున్నిజమే, పవన్ కల్యాణ్ నుదుట అడ్డబొట్టుపెట్టుకుని, పంచె చేతితో పట్టుకుని నడుస్తుంటే...' అనగానే ఎదురుగా ఉన్న పవన్ కల్యాణ్ పగలబడి నవ్వేశారు.

  • Loading...

More Telugu News