: యాదగిరిగుట్టను ముంచెత్తిన వర్షం...ఆలయంలో ప్రవేశించిన నీరు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టను భారీ వర్షం ముంచెత్తింది. గత కొద్ది కాలంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భానుడు ప్రతాపం చూపుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో పడ్డారు. వారి ఇబ్బందిని గమనించాడో, ఏమో కానీ వరుణ దేవుడు కరుణించాడు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట నరసింహస్వామి సన్నిధానాన్ని వర్షంతో ముంచెత్తాడు. యాదగిరిగుట్టపై కురిసిన భారీ వర్షానికి భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కూలిపోయాయి. దేవాలయంలోని బాల ఆలయంలోనికి వర్షపు నీరు ప్రవేశించి, భక్తుల దర్శనానికి ఇబ్బంది కలిగింది. దీంతో అధికారులు చలువపందిళ్ల పునరుద్ధరణ చేపట్టారు.