: కోహ్లీ, అనుష్క ప్రేమకథలో లేటెస్ట్ ట్విస్ట్!
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కా శర్మ ప్రేమాయణం మళ్లీ ప్రారంభమైనట్టు కనబడుతోంది. కెరీర్ నిర్ణయాల విషయంలో తలెత్తిన విభేదాలతో విడిపోయిన వీరిద్దరూ అనుష్క సోదరుడి రాయబారంతో మళ్లీ కలిశారు. అనంతరం వారిద్దరూ కలిసి డిన్నర్ చేశారని వార్తలు వచ్చాయి. బ్రేకప్ కావడంతో అనుష్కను ట్విట్టర్ లో అన్ ఫ్రెండ్ చేసిన కోహ్లీ...ఆమె పుట్టిన రోజు (మే 1) సందర్భంగా ట్విట్టర్, ఇన్ స్టా గ్రాంలో ఆమెను మళ్లీ ఫాలో అయిపోతున్నాడు. దీంతో వారి ప్రేమాయణం మళ్లీ పట్టాలెక్కిందని ఊహాగానాలు ఆరంభమయ్యాయి.