: హిందీ ట్యూటర్ ను పెట్టుకున్న ఎమీ జాక్సన్
హిందీలో మాట్లాడేందుకని బాలీవుడ్ నటి ఎమీ జాక్సన్ ఒక ట్యూటర్ ను ఏర్పాటు చేసుకుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అలీ’లో ఎమీ జాక్సన్ నటిస్తోంది. ఈ చిత్రంలో డైలాగ్ లు చెప్పే సమయంలో కొంత తడబడవలసి వస్తుండటంతో హిందీ ట్యూటర్ ను నియమించుకున్నట్లు చెప్పింది. డైలాగ్ లు చెప్పే విషయంలో ‘అలీ’ చిత్ర దర్శకుడు సొహైల్ ఖాన్, నటుడు నవాజుద్దీన్ ల సాయం తీసుకుంటున్నానని, హిందీ నేర్చుకోవడం కొంచెం కష్టంగానే ఉందని, అయితే, నేర్చుకోవాలన్న తపన కూడా ఉందని ఎమీ జాక్సన్ చెప్పింది.