: మోసపోవద్దు, గుర్తింపు పొందిన సంస్థల ద్వారానే గల్ఫ్ దేశాలకు వెళ్లాలి: పల్లె రఘునాథ్ రెడ్డి
గుర్తింపు పొందిన సంస్థల ద్వారానే గల్ఫ్ దేశాలకు వెళ్లాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సూచించారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ఏపీ కూలీలను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగిస్తున్నామని చెప్పారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఈ విషయమై లేఖ రాశామని తెలిపారు. కూలీలను గల్ఫ్‌కు తరలిస్తోన్న గుర్తింపు పొందని సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు ఎన్‌ఆర్‌ఐ విభాగానికి తమ సమాచారం ఇచ్చి పూర్తి వివరాలు తెలుసుకుంటే సమస్యలుండవని సూచించారు.