: ఇక ఏపీ, తెలంగాణ వంతు!... ‘నీట్’పై పున:సమీక్షించాలని సుప్రీంలో పిటిషన్


దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం ఒకే పరీక్ష పేరిట కేంద్రం ప్రవేశపెట్టిన ‘నీట్’పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. నీట్ వల్ల తమకు తీరని అన్యాయం జరుగుతుందన్న స్టేట్ బోర్డుల విద్యార్థుల పిటిషన్ ను విచారించేందుకే నిరాకరించిన సుప్రీంకోర్టు... పరీక్ష నిర్వహణకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో నిన్న దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు 6 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. కాస్తంత ఆలస్యంగా స్పందించిన తెలుగు రాష్ట్రాలు... ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొద్దిసేపటి క్రితం ఈ విషయంపై సుప్రీం గడప తొక్కాయి. నీట్ పై పున:సమీక్ష చేయాలని రెండు రాష్ట్రాలతో పాటు పలు ప్రైవేట్ వైద్య కళాశాలలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు... వాటిపై రేపు విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. నీట్ పై అభ్యంతరాలను రేపటి విచారణ సందర్భంగా చెప్పండంటూ పిటిషనర్లకు కోర్టు సూచించింది.

  • Loading...

More Telugu News